త్రిజట;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 త్రిజట అన్నింటికంటే సీతారామలక్ష్మణులతో త్రిజట సంయోగమే అత్యున్నతమైనది ఎందుకంటే ఇడ పింగళ మరియు సుషుమ్మ్న సమన్విత ఊర్థ్వాయనే రామాయణం యొక్క పరమార్థముగా ఉన్నది ఈ పరమార్థాన్నే త్రిజట తన స్వప్నంలో చరితార్థం చేసి చూపుతుంది  రామాయణంలోని ఈ మహత్వ పూర్ణ ప్రసంగాన్ని ఈ రూపంలో ఎవరు అవగాహన చేసుకుంటారో వారిని సరిగా అర్థం చేసుకున్న వారు అని భావించాలి. 
శూర్పనఖ  
మందర మరియు శూర్పనఖ రామాయణంలో క్రమానుగతాన్ని అప్రత్యావత్ దిశ ముందుకు తీసుకుని వెళ్లే మహిళలు వీరు  లోకాభిరాముడైన శ్రీ రాముని పట్టాభిషేక మహోత్సవానికి అయోధ్యతో సహా ప్రజలందరూ అత్యంత ఉత్కంఠ ఆనంద ఉత్సాహాలతో ఎదురుచూస్తున్న సమయంలో  అకస్మాత్తుగా శ్రీరాములు వనవాసానికి వెళ్ళవలసి వస్తుందని ఎవరూ ఊహించలేదు  పాపిష్టి మందర కుతంత్రం వల్లనే కీర్తి కండూతి యైన కైకేయిలో నిద్రాణమై ఉన్న అత్యాశ బహిర్గతమైంది  శ్రీరాముడు అయోధ్యకు దూరమైపోయాడు ఈ విధంగానే శూర్పణఖ అకస్మాత్తుగా రావడం రామలక్ష్మణుల సాత్విక పరిహాసం  పంచవటిలో రామ రావణుల మధ్య వైరానికి  బీజారోపణ జరిగింది ఫలితంగా రాముడు సీత విడిపోయారు మందర కైకేయి లోభితనాన్ని శూర్పణఖ రావడం ఈ కార్యాన్ని ఉద్దేపింపచేసి రామాయణాన్ని  అప్రత్యశిత కానీ అభీష్ట దిశలో తీసుకుని వెళ్ళింది. ఈ దృష్టితో రామాయణంలో సుర్పణఖ ప్రసంగం రామాయణ కథ గమనంలో మహత్తరంగా నిలిచింది. శ్రీరాముని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సీతా దేవికి ప్రతిద్వందిగా పంచవటిలో అకస్మాత్తుగా ప్రవేశించింది శూర్పణక  గోదావరి తీరంలో స్నానం చేసి సీతారామ లక్ష్మణులు పంచవటి ప్రశాంత వాతావరణంలో హేమంత ఋతువు బంగారు కాంతుల్ని ఆనందిస్తున్నారు ఒకరోజు ఉదయం దండకారణ్యంలో విహరిస్తూ విహరిస్తూ నయనాభిరాముడైన శ్రీ రాముని అద్వితీయ సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలయింది తన కోరికలు తీర్చుకునే ఉద్దేశంతో పంచవటి ఆశ్రమానికి చేరుకుంది శ్రీరాముని ఉజ్వల ముఖ మండలం మంజుల   భుజములు కమలముల వలె  విశాల విస్ఫోట నేత్రాలు కోమల ముఖాన్ని పరాక్రమవంతుడైన శ్రీ రాముని లోకోత్తర శోభ శూర్పణఖను ఇట్టే ఆకర్షించింది.

కామెంట్‌లు