ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తర్వాత రామరాజు గారు తన బలం కూడా చూడమని వారిని  కూర్చోబెట్టి వారి ఎడమ భుజాన్ని తన చేత్తో పట్టుకొని  ఒక్కసారి ఇటు తిప్పేసరికి  ఎడమ చేయి  పనిచేయడం మానేసింది  పక్షవాతం వచ్చిన వ్యక్తిలా తయారయ్యాడు  కన్నీరు పెట్టిన వారిని ఓదార్చి ఏమీ భయపడకండి బాధపడకండి నేను ఉన్నాను  అని ఆ పక్కకు వెళ్లి కొన్ని ఆకులు తీసుకువచ్చి పసరు పిండి  చేతికి వ్రాస్తూ మర్దన చేశారు  ఒక గంట సేపట్లో తిరిగి  మామూలు స్థితికి వచ్చారాయన   రామరాజు గారికి పాదాభివందనం చేసి  నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అన్నారు  ఇందులో గెలుపు ఓటమి అన్న ప్రసక్తి రాదు  స్నేహితులలా మనం కలిసి చేసేంతప్ప  పోటీ కాదు  అని   ఊరడించారు.
చూడండి రాజుగారు  జీవితంలో ఏ వ్యక్తి అయినా తనకు తెలిసిన విషయాలను  చాలా గొప్పగా  భావిస్తూ  మిగిలిన విషయాలపై దృష్టి పెట్టడం మానుకోవడం  మనకు బాగా  తెలిసిన విషయం  తనకు తెలిసిన అతి చిన్న విషయాన్ని ఎంతో గొప్పగా ఊహించుకొని  ఎంతో అహంకారంతో  మిన్ను మన్ను తెలియనంత  అహంకారానికి లోనువుతాడు  తాను ఏది నేర్చుకోవాలో తనకు దీనిలో నేర్పరితనం ఉండదు తనకు తెలియాలి అంటే గురుముఖుతహా తెలియాని తప్ప  తనకు తెలియదు  మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను కలవాలి నాతో పోటీ పడాలి అని ఆలోచన ఉన్నది  ఇన్ని సంవత్సరాలు పడ్డమీ తపన  డాక్టర్ రాజు గారి వల్ల తీరింది  జీవితంలో అనుకున్నది తప్పకుండా సాధించగలగాలి  అది మానవ   మస్తిష్కానికి  పరీక్ష.
మీలో దీక్ష పట్టుదల ఉన్నాయి  నేను విను విద్యలో కొంత ప్రావీణ్యాన్ని గురువుల సమక్షంలో నేర్చుకున్నాను  నేను నేర్చుకున్న విద్యను మీకు  కూడా నేర్పుతాను  మీకు  ఇష్టం ఉంటే అది నేర్చుకోండి  దానిలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు  అని చెప్పిన తరువాత  రామరాజు గారి పాదాలను ఆశ్రయించి  మీరు ఏది చెప్పితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను  మీకోసం నా ప్రాణాల నైనా ఇస్తాను  గురువుగా నాకు విద్య నేర్పుతాను అంటే నా జీవితంలో ఇంతకన్నా ఏ భగవంతుడు    ఇవ్వని వరం  ఈ దేవుడు ఇచ్చాడని  భావిస్తూ మీ శిష్యునిగా పనిచేస్తాను  అన్న తర్వాత వారిని అక్కడే ఉంచి వారిని   విలువిద్యలో  సాటిలేని మేటిగా తయారు చేశారు.

కామెంట్‌లు