ఏక సంధాగ్రాహి వేంకట రాజు గారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
చెరువులో స్నానం చేస్తున్నట్లు నటిస్తూ  వారిని పరిశీలనగా చూస్తూనే ఉన్నాడు. నేనే అనుకునిఅతనిని కాల్చడానికి ధైర్య సాహసాలు లేక  అతి కష్టం మీద నేనే అనుకుని నా తమ్ముడిని కాల్చారు  అంతే తప్ప నన్ను చెట్టుకు కట్టడం  తుపాకీతో కాల్చడం అబద్ధం  వారి నీతి ప్రకారం వాళ్లు ప్రకటించారు తప్ప అది వాస్తవం కాదు  ఆ తరువాత నేను  పెంచుకున్న గడ్డం ప్రస్తుతం నాకు ఎంతో అనుకూలంగా ఉంది  దానితో కాషాయ దారినై  సాధు పుంగవునిగా కాలక్షేపం చేస్తున్నాను  అజ్ఞాతంగా జీవితాన్ని గడుపుతున్నాను  దానికి కారణం  మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నైనా సరే రామరాజు కనిపిస్తే మాకు అప్పగించాలి అన్న నియమం ఒకటి పెట్టి  ప్రభుత్వంతో లాలూచీ జరగడం వల్ల  నేను ఇలా జీవితాన్ని అజ్ఞాతంగా గడపవలసిన పరిస్థితి ఏర్పడింది అని తెలియజేశారు
తరువాత రామరాజు గారి దగ్గర విద్య పూర్తి చేసుకొని  వారికి కృతజ్ఞతలు తెలియజేసి  నేను  విజయవాడ వచ్చి  నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను  మధ్య మధ్యలో అవకాశం వచ్చినప్పుడల్లా  అన్నా విలు విద్య ప్రదర్శనలను ఏర్పాటు చేసుకుంటున్నాను  ఈ విషయం తెలిసి అప్పటి విద్యాశాఖ మాత్యులు  బుద్ధ ప్రసాద్ గారి తండ్రి  మండలి వారికి విషయం తెలిసి  తెలుగు సభలు అన్న కార్యక్రమాన్ని ప్రారంభించి హైదరాబాదులో మొదట  భారీ ఎత్తున  పెద్దలతో కార్యక్రమం చేస్తున్న  దానిలో  రామభద్ర రాజు గారికి కూడా ఆహ్వానం రావడం  వీరి విలువిద్య ప్రదర్శన  జరగడం విశేషం  ఆనాడు భారతంలో  రెండు చేతులతోనూ బాణాలు వేయగలిగిన అర్జునుడు ఎన్ని  విన్యాసాలు చేశాడో అన్ని విన్యాసాలు చేసి చూపించాడు రాజుగారు  రెండు చేతులతో  బాణాలను వెయ్యడం చాలా ముందుకు వెళ్లి బాణాన్ని వెనుకకు  మార్చి వస్తువుపై ప్రయోగించడం. ఆనాడు అర్జునుడు ఏడు చెట్లను ఒకే బాణంతో కొట్టడం  భారతంలో విశేషంగా చెప్పుకున్నారు  దానిని ప్రత్యక్షంగా రామభద్ర రాజుగారు  ఇసుకలో ఏడు చెట్లను వరుసగా పెట్టి  ఓకే బాణంతో ఆ మూలాలను  సమూలంగా పెకలించడం  ప్రేక్షకులు విశేషంగా చెప్పుకున్నారు  నేను డాక్టర్ వెంకట్ రాజు గారు  రామరాజు గారి స్వస్థలానికి వెళ్లి  అక్కడ వారి వంశంలో ఉన్న వారిని కలిసి  పాత విషయాలను చాలావరకు  తెలుసుకొని వచ్చాం  వారి సమాధిని చూస్తూ ఉంటే  కళ్ళ వెంట నీళ్లు వస్తాయి  కుక్కలు పందులు తిరిగాడుతున్నాయి ఆ ప్రాంతం  పాడుబడినట్లుగా ఉంది ఆ స్థలం  దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక  స్వాతంత్ర్య సమరయోధుడికి ఇవ్వవలసిన  కనీస గౌరవం కూడా  ప్రభుత్వ పరంగా లేకపోయినా  ఆ గ్రామస్తులైనా పనిగట్టుకుని చేస్తే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చాం  వ్యక్తిగతంగా మనం ఏమీ చేయలేం కదా.
 
కామెంట్‌లు