త్రిజట;- ఏ బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 ఈ మార్గదర్శనకు మనకు త్రిజట స్వప్నంలో లభిస్తుంది ఇదే యావత్ రామాయణ కథ నుంచి మనకు లభించే సార భూత శిక్ష అందుచేతనే  శ్రీ రాముని మరియు వారి పరిజనము వలె మనము వ్యవహరించవలెనా రావణ మార్గంలోనా ఈ ప్రసంగం తర్వాత త్రిజట మరల యుద్ధకాండలో కనిపిస్తుంది యుద్ధకాండలో రామలక్ష్మణులు నాగపాశ ప్రభావంతో కొంచెం సేపు స్పృహ కోల్పోతారు.  ఈ అవకాశాన్ని అదనుగా తీసుకొని రావణుడు సీతాదేవి రణ భూమి నుంచి పుష్పక విమానంలో బయటకు తీసుకుని పోతాడు మృత ప్రాణులైన ఇద్దరిని చూపిస్తాడు అమాయకురాలైన సీతచింతాగ్రస్తురాలు అవుతుంది కానీ సీత వెంట వెళ్లిన  త్రిజట సీతతో చెబుతుంది అమ్మ నీ రామలక్ష్మణులు సజీవులే కారణం ఈ పుష్పక విమానంలో ప్రయాణం చేస్తున్నది  ఇప్పుడు నీవు సౌభాగ్యవతి కావడమే ఇందుకు కారణం. ఈ పుష్పక విమానం సౌభాగ్యవంతులనే మోస్తుంది ఈ విధంగా ఈ క్లిష్ట దశలో కూడా త్రి జట సీతకు సాంత్వన మార్గాన్ని ఎంచుకుంది.రామాయణంలో సీతకు రక్షణ కల్పించిన మరొక పాత్ర జటాయువు త్రిజట జటాయువు ఈ రెండు శబ్దాల్లో జట సామాన్యం వైదిక వాంగ్మయంలో కూడా జట శబ్దం వస్తుంది వివిధ పాఠాల్లోనే ఒక విశిష్ట ప్రక్రియకు జట అని పేరు ఉంది కనుక వేదవతి సీత రక్షణ భారం జటాయువు మరియు త్రి జట తమపై వేసుకున్నారు ఇందులో ఆశ్చర్యం ఏమాత్రం లేదు వాస్తవానికి సీతామాత వేదమాతే ఆమె దర్శనం కొరకు రామదూత హనుమంతుడు త్రికూటం మీద గల లంకా నగరాన్ని అణువణువు శోధించసాగాడు  పరమపంకిలమైన వాతావరణంలో నుంచి సీతామాతకు విముక్తి కలిగించి పరమ పితా పరమాత్మ అయిన శ్రీరామచంద్రునితో కలవడానికి సంధాతగా పనిచేశాడు. ఈ విధంగా హనుమంతుడు త్రి జట జటాయువు మొదలైన వారు ఈ మహానుస్టానంలో సహకరించే  సాధకులుగాను ఆరాధకులుగాను ప్రసిద్ధి చెందారు. త్రిజట ఈ శబ్దంలో కేవలం జటశబ్దమే కాదు సంఖ్యావాక్యమైన త్రి (మూడు) ప్రయోగం కూడా ఉంది  ఈ ఏక జట త్రిజట హరి జటా అనే పదాలు రామాయణంలో దొరుకుతాయి  అన్నింటిలోకి త్రిజట సీతాదేవికీ అత్యంత సన్నిహితంగా తోస్తుంది  స్వర్గ మత్యపాతాళములోకాలు జాగృతి స్వప్న సూసుక్తి పేర్లు గల మూడు స్థితులు (దశలు) అకార ఉకార మకార సంయోగంతో ఏర్పడిన ప్రాణము యొక్క మూడు ముద్రలు అది త్రై యొక్క అనేక సంపుటాలకు ప్రతినిధి.
కామెంట్‌లు