మల్లన్న మల్లన్న ఓహో శ్రీశైల మల్లన్న(గేయం)- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640 748497
మల్లన్న మల్లన్న
ఓహో శ్రీ శైలమల్లన్న
మా ఆపదమొక్కుల
దిక్కువు నువ్వే
శ్రీశైల మల్లన్న

ఈ ధీనజనులకు
దేవుడు నువ్వే
శ్రీ శైలమల్లన్న

మాముడిచిన చేతులు
మొగ్గలు నీకు
శ్రీ శైలమల్లన్న

మావిచ్చిన చేతులు
పువ్వులు నీకు
శ్రీ శైలమల్లన్న

కొబ్బరి కాయలు
కోటి మొక్కలు
శ్రీ శైలమల్లన్న

దండిగగొలుతుము
దయగల తండ్రి
శ్రీ శైలమల్లన్న

ఏమిదెలువని
మూఢభక్తులం
శ్రీ శైలమల్లన్న

 మాగుండె 
గండదీపంనీకు
శ్రీ శైలమల్లన్న

అనాథ రక్షక
ఆశ్రిత పాలక
శ్రీ శైలమల్లన్న


కామెంట్‌లు