చావుచెప్పిరాదు;- అంకాల సోమయ్య- దేవరుప్పుల-జనగాం-9640748497
(కథ)
@@@@@@@@
కొత్తిల్లుకట్టాము
ఇండ్లళ్ళకొచ్చాము
చుట్టాల పక్కాలబిలిచి
దావతిచ్చినం మానాన్న కూడా
మామేనమామలతోకూసోని
కలిసి కడుపునిండా అన్నం తిన్నడు
అర్థరాత్రి కాడగుండెకాడ
నొప్పి వేస్తుందని అమ్మతోఅంటే
అమ్మ అందర్నీ లేపి విషయం ఏడుస్తూ చెప్పింది
 మామేనమామ
గబగబవెళ్ళి
కారుతీసుకొచ్చిమానాయనను
కారుఎక్కిచ్చేలోపే
ఊపిరాగిపోయిందట 
ఇంటిల్లిపాదీ
సంతోషాన్ని తనివితీరా ఆస్వాదించకముందే
గుండెలు పగిలేలా ఏడ్చేంత
దుర్వార్త 
మానాన్న కాలంచేసాడని
అమ్మ నిస్సహాయురాలై
నోటమాట రాక నావంకే
చూస్తూ ధారాపాతంగా కారుతోన్న కన్నీరు
అమ్మ అమ్మ అని గట్టిగా అరిచిన తిరిగి సమాధానం
ఇవ్వలేనంతగా అమ్మ గొంతు
ఏడ్చి ఏడ్చి మూగబోయింది
వచ్చిన బంధువులంతా
అయ్యో! పాపం ఇద్దరు మగపిల్లలగన్నా
ఏమి లాభం?
కొడుకులు బాగుపడే‌ దశలోనే
వీరి తండ్రిని చంపిండే ఆదేవుడు?
లంకంతకొంపగట్టిండు?
ఆ తల్లికి పుట్టేడు దుఃఖాన్ని
బహుమానంగా ఇచ్చిండే?
ఆదేవుని గుల్లె మన్నుబోయ?
పాపకారి దేవుడు ?
లోకం తెలియని బిడ్డలను
తండ్రి లేని పక్షుల చేసిండే?
రేపటి నుండి ఇల్లు గడిచే
దెట్లనో?
మా తమ్ముడు నేను చదువు
సాగించే దెట్లనో?
కాలం పెట్టిన ఈ పరీక్ష లో
మా అమ్మ గెలిచేనా?
మాకు మా పెద్దనాన్న చిన్నాన్న
తోడునీడగా ఉండేనా?
తండ్రి శవం మిగిల్చిన వేలవేల
ప్రశ్నలు?
వచ్చిన బంధువులంతా
ఒకటే ఏడ్పులు పెడబొబ్బలు
మాపై వల్లమాలిన అభిమానం
చూపుతున్న ఓదార్పు మాటలు
ఎలాగో అలాగా ఊరు చివర
కాడు కట్టెలేసొచ్చి
అతిశయించిన దుఃఖంతో
మా తండ్రి దహనసంస్కారం
పూర్తి చేసినం
ఇక మూడవరోజు
పిట్ట కు పెట్టే కార్యక్రమం
చావు కొచ్చిన బంధువులు
సగం రానేలేదు
ఒకరికొకరు గొణుక్కుంటున్నారు
ఏదో ఇంటోళ్ళు ఒకరిద్దరు కులపోళ్ళు వస్తే అయిపాయే

వానికి తింటానికే లేదు మూడో
రోజు నుండే మందు మాకు
పెడితే ఎవడు మిగులుతడు
అంటూ 
కొందరూ దెప్పొడుపుమాటలంటున్నారు
నాకు అప్పుడే అర్థమైంది

మా నాయన ఉన్నోడు లేనోడని
చూడకుండా చావు సంస్కారం అంతా దగ్గరుండి చేసేటోడు

ఇప్పుడు మా నాయన లేడు
ఇప్పుడు మా అవసరం వీళ్ళకులేదు?
అనిఈ సంఘటనతో నేను జీవితానుభవం  నేర్చుకున్నాను

బెల్లం ఉన్న చోట ఈగలు వాలుతై అంటే నాకు అప్పుడు అర్థం కాకపోయేది
ఇప్పుడు పూర్తిగా అర్థమైంది
ఏదిఏమైనా ఎవడైనా చస్తాడుగా?

ఇప్పుడు మమ్మల్నీనానా మాటలనే దయలేని, మనసు లేని మనుషులు వీరికి రేపు చావురాదా?

రేపు వాళ్ళ పరిస్థితి ఏంటని
ఏ ఒక్కడూ ఆలోచించడే?

బాధలో ఉన్న వాళ్ళను ఓదార్చే
బదులు సూటిపోటి మాటలతో
పైశాచికానందం పొందుతున్నారు?

ఈ నా స్వీయ సంఘటన నా జీవితానికి సరిపడా అనుభవాన్ని నేర్పింది

మా నాన్న అన్నట్టు మనకున్నా
లేకున్నా బాధలో ఉన్న వారికి
సాంత్వన కొండంత అండగా
నిలుస్తుందని
చావు ఎప్పుడూ? ఎలా వస్తుందో?
మనకు తెలియదని? మా నాయన చావడానికి నెలరోజుల ముందే అన్నడు?
ఏంది నాయన గిట్లంటున్నవంటే?
బిడ్డా!మనం పుట్టినప్పుడు ఏమన్నా తెచ్చినామురా?
పోయెటప్పుడు ఏమన్నాపట్టుకపోతాంరా?
నీ పుట్టుక నీకు తెలియదు?
నీ చావు ఎప్పుడొస్తుందో నీకు
తెలియదు?
బిడ్డ మనకున్నంతలో సాటి వారికి సాయం చేయాలిరా?
ఇప్పుడు నాకు అంతా అర్థమైతాంది
ఆ దేవుడు ముందే మానాయన
నోరాడిచ్చిండు
మమ్మల్ని జాగ్రత్తగుండమని
మానాయన
చెప్పకనే చెప్పిండు


కామెంట్‌లు