సంతృప్తితో సాధించు!? ;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
జీవితమంతా పరిగెత్తి పరిగెత్తి
ఎక్కడో ?!
ఒక దగ్గర ఆగిపోవలసిందే--!
నీ శరీరం విశ్రాంతి కోరుకుంటుంది?!
మునుపటి పటుత్వం తప్పిందని
నీ దేహం సంకేతాలిస్తుంది

ఆశ ఎప్పుడూ పడుచుదే
దానికి వార్ధక్యంతో సంబంధం లేదు!?

నువ్వు చేధించాల్సిన లక్ష్యాలు
ఎన్నున్నా 
నీకు నువ్వే తదాత్మీకరణతో (సంతృప్తితో)
సాధించుకోవలసిందే?!

నీలో వెలిగే ఆత్మజ్యోతి
ఎప్పుడు (నిన్ను వీడునో)ఆరిపోవునో?!
నీకు తెలియదుగా?!
బ్రతికున్నప్పుడే?
పదుగురిగి సాయంచేయ్!
పుణ్యసంపద పోగేయ్!

కామెంట్‌లు