\నోటుకు నాటుకు
అలవాటు పడ్డ ఓటర్లు
ఇక్కడ ప్రజాస్వామ్యము
సమాధి
వ్యక్తి స్వామ్యానికి పునాది
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనే విషయం మరిచిన
ఓటర్లు
అభ్యర్థుల ఊకదంపుడు ఉపన్యాసాలకు తలొగ్గి
అసమర్థ ప్రభుత్వానికి
పట్టంగడితే
ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారై
మరో శ్రీలంక ఉదంతం వెలుగులోకి రాకతప్పదు
ఓటంటే ఓటరు పాశుపతాస్త్రం
ఓటంటే యావద్దేశపు దిశా దశ
ఓటంటే స్వప్రయోజనకారి కాదు
ఓటంటే నీ ఆత్మ గౌరవానికి ప్రతీక
రౌడీ లు, గుండాలు మోసకారులు
ఎన్నికల్లో నిలబడకుండా
వారి వాస్తవిక ప్రవర్తన ను
ప్రజాక్షేత్రంలో రూఢి పరుచుకున్న
వారికే బీ ఫారమ్స్ ఆయా పార్టీలు అందించాలి
ఈ కలికాలంలో శ్రీరాముడంటి
పాలకుడిని ఎంపిక చేయలేక పోయినప్పటికీ
రౌడీ గుండాల్ని దోపిడీకోరులను
నియంత్రించడానికి అవకాశం ఉంది
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి
సామాన్య పౌరుడు కూడా
ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే అవకాశం దక్కాలి
ఓటు నోటు రాజకీయాలు అంతమోందాలి
ప్రజల ఈతి బాధలు తెలిసిన,
ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలిగిన ,అభ్యర్థులే
రేపు పాలకులుగా ఎన్నుకోబడాలి
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం
ప్రపంచానికి ప్రజాస్వామ్య రుచి ఏంటో చూపిద్దాం
Save democracy
Save the nation
Save the people
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి