కలం యోధులు";- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగాం9640748497
అన్యాయంపై ఎక్కుపెట్టిన అక్షర బాణాలు2

అవినీతిని అంతం చేసే అక్షర తూటాలు2

వంచకులను  తుదముట్టించడానికై
వెతికే టార్చ్ లైట్లు 2

దోపిడీ దొంగల గుట్టురట్టు చేసే
పరిశోధక  జర్నలిస్టులు2

ఊసరవెళ్లిలారంగులుమార్చే
రాజకీయపుఅసలురంగునుచూపే నిత్య
అక్షర శ్రామికులుధైర్యశాలురు2

అక్షరమే ఆయుధంగా సమరంచేయు కలంయోధులు2

అణగారిన వర్గాల అభ్యున్నతికై
అహరహం శ్రమించే అభ్యుదయవాదులు2

కలంతో పాటు కాలాన్ని నడిపిన పాత్రికేయులు2

ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్ ఫాం ఏదైనా ప్రజావాణిని
ప్రజాస్వామ్యాన్ని కాపాడే
సెంట్రీలు2

(జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా వ్రాయడం జరిగింది ఈ కవిత)
కామెంట్‌లు