నిన్ను నువ్వు ఏలుకో లేవా?!;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
అగ్ర వర్ణాలకు
పెట్టుబడి దారులకు

ఇంకెంత కాలం
అధికారం కట్టబెడతావు
నిన్ను నువ్వు ఏలుకోలేవా?!


నువ్వు ప్రలోభాలకు
తలొగ్గి 

పాశుపతాస్త్రం లాంటి ఓటును
తెగ నమ్మి

చోద్యం చూస్తుంటావా!?

నీవు ఆత్మ గౌరవం
కోల్పోయి

బతికున్న
జీవశ్చవమవుతావా?!

నీకు ప్రజా ప్రతినిధి
అయ్యో
యోగ్యతలేదా?!

ఒకని మోచేతి నీళ్లు
ఇలా ఎంతకాలం తాగుతావు?!

రాజ్యాధికారం అంటే
ఒకడు ఇచ్చేదా?!

మన మచ్చలేని వ్యక్తిత్వం
మన సత్ప్రవర్తన

ఉచిత (ఆచరణ సాధ్యం కాని)
 హామీలీయకుండా?!

ప్రజల జీవన ప్రమాణాలు
బాగుపరచేవి

ప్రజల భాగస్వామ్యంతోనే
ప్రజా ఎజెండాను
తయారుచేయలేవా?!

ధన రాజకీయానికి
చరమగీతం పాడలేవా?!

జనరాజకీయానికి
స్వాగతం పలుకలేవా?!

మార్పుమన మంచి కొరకే!!!
సుపరిపాలన కొరకు

అవినీతి రహిత సమాజం కొరకు!!!!

రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేద్దాం!!!!!

 భారత రాజ్యాంగం వర్థిల్లాలి!

జనాభా ప్రాతిపాదికన మన అందరికీ 
సమాన అవకాశాలు 
 దక్కితీరాలి!కామెంట్‌లు