సర్వం శివమయం జగత్;- డా.రామక కృష్ణమూర్తి- బోయినపల్లి,సికింద్రాబాద్.- 9948285353
సర్వవేదాల సారం శివతత్వం
సర్వమూ శివాత్మకం
చైతన్య స్వరూపమే ఆ మూర్తిమత్వం
కర్మాతీతమైన ఋజుత్వం
ఏకత్వ మహిమను చూపి
జీవభ్రాంతిలేని జ్ఞానం ప్రసాదిస్తుంది.
బీజరూప లింగమయమై
బోళామయమే అవుతున్నది‌.
మోకరిల్లి మొరపెట్టుకున్నంతనే
దుర్మార్గుణ్ణీ ప్రేమించగలగడం దైవత్వం
విబూదియే ఐశ్వర్యమను తాత్వికతను పంచుతూ,
నిరాడంబరతకు నిదర్శనమై,
మార్మిక తార్కిక సిద్ధాంతాన్ని ఉద్భోదించి,
అర్థనారీశ్వర సంకేతమై,
భక్తసులభమై తేజోవంతమై
మోక్షమార్గానికి దారిచూపుతుంది.
కామెంట్‌లు