చిన్నారి బుజ్జిపాపాయిల మోములో
నిస్కల్మషమైన బోసినవ్వులు,
అప్పుడే అరవిరిసిన పుష్పాలను చూస్తే
మనసు హాయిగోలిపే చిరునవ్వు.
అంతకు మించి ఏ నవ్వులు లేవు
స్వేచ్చగా ఆడుతూ పాడుతూ
నవ్వుతూ, తుళ్ళుతూ అరుబయట
విశాల బడిలో సాగె విద్యార్థి దశ
చదువులు, ర్యాంకుల పోటీలో,
అపార్టుమెంటు ఏసీ తరగతి గదుల్లో
బoదీ అయిపోయింది.
కులాసాగా, యుక్త వయసు లో రంగు రంగు కలలు
కంటూ ఆనందంగా నవ్వుతూ సాగేకళాశాల జీవితం
భవిష్యత్తు స్థిరత్వం ఆందోళన కొందరిదైతే,
కామాంధుల పశుత్వానికి, ప్రేమ అనే వల
వేస్తూ,జీవితాన్ని నాశనం చేసేవాళ్లకి బలి అయిపోతుంది.
పెళ్లి అయిన కొత్త జంట ప్రేమ విహారాలు చేస్తూ
నవ్వుతూ ప్రేమ కబుర్లు అన్నీ,
అవసరాల పెళ్లిళ్లు, ఆర్థిక లావాదేవీలా
పెళ్లిళ్లతో ముడివడి ఉరుకుల పరుగుల జీవితాల్లో
కొత్త జంటల ఊసులు, నవ్వులే కరువైయాయి.
ఏ రంగం లో చూసినా ఏముంది అన్న చందాన
ఎటు చూసినా ఈర్ష్యలు, కోపాలు, పోటీలు
వీటి అన్నిటి మధ్య నవ్వు తో పలరింపులే
మాయమై పోయాయి.
అందరిలో నిస్వ్వార్థం,
ప్రేమ ఎప్పుడు మళ్ళీ ఆవిష్కరిస్తాయో
చిరునవ్వులు పూయిస్తాయో!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి