రాతి పలక";- -గద్వాల సోమన్న,9966414580
నాన్న తెచ్చిన నల్లని పలక
రాతితో చేసిన నా పలక
బలపముతో స్నేహం చేయును
వర్ణమాల వ్రాయ  సాయపడును

సంచిలోన వాసముండును
బడిలోన బయటకు వచ్చును
విద్యార్థుల హస్తాలలో
నెమలి వోలె నాట్యమాడును

అవ్వాతాతలు వాడినది
అమ్మానాన్నలూ వాడినది
ప్రస్తుతం రాతి పలక బదులు
రేకు,అట్ట పలక వచ్చినది

నేడు రకరకాల పలకలు
చూడు విలువైనవి సేవలు
సాటి లేనివి రాతి పలకలు
మేటియైనవి రాతి పలకలు

కామెంట్‌లు