అక్షరాల అదేశము;- -గద్వాల సోమన్న,9966414580
కన్నవారి కరుణలో
ఎదగాలి జీవితాన
వారు చూపు త్రోవలో
నడవాలి ఈ జగాన

పెద్దవారి మాటలో
ఎరుగాలి పరమార్థము
వారి  గొప్ప సేవలో
తరించాలి జీవితము

పసివారి నవ్వుల్లో
తిలకించాలి అందము
వారి మోము పువ్వుల్లో
గ్రోలాలి మకరందము

ముందుండాలి గుణంలో
ఫలించాలి మొక్కలా
దైనందిన బ్రతుకులో
ప్రకాశించాలి చుక్కలా

కామెంట్‌లు