మనోభీష్టం;- -గద్వాల సోమన్న,9966414580
మహనీయుల అడుగుల్లో
అడుగులేసి నడుస్తాము
పెద్ద వారి పలుకుల్లో
పరమార్థం   గ్రహిస్తాము

కష్టాల వేళల్లో
కనికరం చూపిస్తాం
కన్నీటి లోయల్లో
కలవరం తొలగిస్తాం

చేయి చాచి అడిగితే
సహాయమే చేసేస్తాం
ఆశ్రయమే కోరితే
దుర్గమై నిలుస్తాం

తప్పులను ఒప్పుకుంటే
క్షమాపూలు రువ్వుతాం
స్నేహమనే వనంలోన
కలసిమెలసి తిరుగుతాం

 స్ఫూర్తినిచ్చు దారుల్లో
చుక్కల్లా వెలుగుతాం
కీర్తి నొసగు  పనుల్లో
నిమగ్నమై మేముంటాం

కామెంట్‌లు