వివక్షేల మానవా!!;- -గద్వాల సోమన్న,9966414580
విరిసే పూవుకు లేదు
మెరిసే తారకు లేదు
వివక్షేల మానవా!!
కురిసే  చినుకు లేదు

పండే పంటకు లేదు
మండే మంటకు లేదు
వివక్షేల మానవా!!
వండే వంటకు లేదు

వీచే గాలికి లేదు
కూసే కోడికి లేదు
వివక్షేల మానవా!!
పూచే తోటకు లేదు

పారే ఏరుకు లేదు
ప్రాకే తీగకు లేదు
వివక్షేల మానవా!!
పాడే పాటకు లేదు

కామెంట్‌లు