ఏరిన ముత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
కన్నవారి చరణాలు
తాకినచో చాలు చాలు 
గురుదేవుల సన్నిధిలో
పడి ఉన్న మేలు మేలు

పెద్ద వారి సేవలో
కోకొల్లలు దీవెనలు
భగవంతుని పూజలో
నిష్ఠ ఉన్న లాభాలు

అక్షరాల వనంలో
విహరించిన విజ్ఞానము
పుస్తకాల పఠనంలో
వీడిపోవు అజ్ఞానము

ఆశయాల సాధనలో
పట్టుదల ఆధారము
అనుదిన జీవితంలో
మనశ్శాంతి కీలకము

నైతిక విలువల వలువలు
మెరుగుపరచు జీవితాలు
నమ్మకాల పునాదులు
రక్షించు కుటుంబాలు

కామెంట్‌లు