కరుణించగ రార;- కోరాడనరసింహా రావు!
శ0కరా... అభయంకరా.... 
 ఆద్యంతరహిత ఓ లింగ స్వ రూప...! 
 
ఈశా... మహేశా... లోకేశా, జగదీశా...!! 
 
కావరా  మము బ్రో వ రా... 
 కరుణాకరా ...పర మేశ్వరా..!!


స్మ శా న మే  నీ ఇల్లు రా.... 
నాగ భూషణ, నంది వాహన
  గరళ కంఠ, గంగా ధర...! 

త్రినేత్ర ధారీ , త్రిసూల పాణి
 బోలా శ0కర , దయా సాగరా
మము కావగ రారా... కరుణిం చవదేరా...!! 

ఈ శా... మహేశా... నటే శా... యోగీశా పంచ భూతే శ్వరుడవు రా...!నీ వే లయ కరుడవుగదరా...!! 

సంగీత , సాహిత్య, నాట్య కళ లన్ని  , నీ నుం డే ఉద్భ వించెనురా..... నీ అనుగ్ర హమును మాపై పరి పూర్ణ ముగ కురిపించుమురా....! 
 హర హర  , శ0భో శ0క రా
మము కరుణించగ రా ర..!! 
      ******
కామెంట్‌లు