ప్రముఖ కవి, రచయిత డాక్టర్. గౌరవరాజు సతీష్ కుమార్ కు సేవారత్న పురస్కారం
 సంగారెడ్డి జిల్లా, జోగిపేట గ్రామం లోని స్థానిక ప్రముఖ కవి రచయిత, డాక్టర్. గౌరవరాజు సతీష్ కుమార్  గారికితెలుగువెలుగు సాహిత్య జాతీయ వేదిక స్థాపితమై దిగ్విజయంగా 1000 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ ప్రధాన న్యాయనిర్ణేతగా, విశ్లేషకులుగా విశేష సేవలందించినందుకుగాను  సేవారత్న పురస్కారం వేదిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సాహిత్య యవనికపై అక్షర సేవలు చేస్తున్న తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక కుటుంబ సభ్యులలో ఒకరిగా పని చేయటం సుకృతంగా భావిస్తున్నానని, ఈ పురస్కారం నా బాధ్యత నిర్వహణలో మరింతగా అంకితం కావాలని ఆకాంక్షిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా గురువులు,మిత్రులు, శ్రేయోభిలాషులు,పురప్రముఖులు సతీష్ కుమార్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు