చరమాంకం;- సి.హెచ్.ప్రతాప్
 వయసు మీద పడ్డాక
బ్రతుకంతా త్యాగాలు చేసి
పెంచిన తమ పిల్లలు
మన చేతులు పట్టుకొని ఆసరా ఇచ్చి
నడిపించాలని ఎదురు చూస్తారు
పాపం తల నెరసిన వృద్ధులు
వారికి కావాలి కాస్తంత ఓదార్పు
కొంచెం ఆసరా, మేమున్నామని భరోసా
ఈ స్పీడు యుగంలో అది దుర్లభం
పెద్దవాళ్ళు కూరల్లో కరివేపాకులు
వాసన వున్నంత వరకే విలువ
ఆనంతరం చెత్తబుట్టే గతి
ఊహల పల్లకిలో ఊరేగే
వృద్దులకు ఆయువు క్షీణించి
ఆదుకునేవారు లేక
అనాధలుగా జీవిస్తూ
సమాజం చీత్కారాలకు గురౌతూ
చివరకు ఎండుటాకుల్లా రాలిపోతారు
గగనంలో దారం తెగిన గాలిపటం
నేటిసమాజంలో వృద్ధుల జీవితాలు
కామెంట్‌లు