శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ;- కొప్పరపు తాయరు
🪷 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🪷

అదౌ కర్మ ప్రసంగాత్కల యతి కలుషం
మాతృ కుక్షౌ సితం మాం
విణ్మూత్రా మేధ్య మధ్యే క్వదయతి నితరాం
 జాఠ రో జాత వేదాః !
యద్యద్వై  తత్ర దుఃఖం వ్యధ యతి రాం
 శక్యతే కేన వక్తుం
క్షంత వ్యోమే అపరాధః , శివ శివ శివ భోః
శ్రీ మహాదేవ శంభో!!

ఓ శివా! తల్లి గర్భమునందున్న నన్ను పూర్వ జన్మలో చేసిన పాపకర్మ చుట్టుకొనుచున్నది. అపవిత్రములైన
మలమూత్రముల మధ్యనున్న నన్ను తల్లి కడుపులో నున్న జఠరాగ్ని ఉడకబెట్టుచున్నది.
    గర్భమునందున్నప్పుడు ఏ ఏ దుఃఖము పీడించునో దానిని వర్ణించుట ఎవరితరం?  ఓ మహాదేవ శంభో నా అపరాధమును క్షమించుము. !

తాయారు 🪷
కామెంట్‌లు