నీవెవరివి? (త్వమేవాహం)- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గుండెనడిగా
నువ్వెవరివని?
గూబలో
గుసగుసలాడింది
హృదయంలో
ప్రేమననిచెప్పింది
శరీరానికి
ఆయువుస్థానాన్నన్నది

కంటినడిగా
నువ్వెవరివని?
కళ్ళొలోకి
నేరుగాచూస్తూచెప్పింది
నిజాలకు
సాక్ష్యాన్నన్నది
పరిసరాలనుపరికింపజేసి
పులకరింపచేస్తానన్నది

నోరూనడిగా
నువ్వెవరివని?
పెదాలువిప్పి
చెవ్వుల్లో ఊదింది
మనసులోనిభావాలను
మాటల్లోచెప్పేదానినన్నది
మనుషులకుజంతువులకు
తేడాచూపేదానినన్నది

చేతినడిగా
నువ్వెవరివని?
వీపుపైతట్టి
వివరణనిచ్చింది
బ్రతకటానికి
పనిచేయించేదానినన్నది
ఆపదలోనున్నవారికి
ఉపకారముచేయించేదానినన్నది

అడుగునడిగా
నువ్వెవరివని?
కదలకుండాకూర్చోమని
ఇలాచెప్పింది
గమ్యస్థానాలను
చేర్చేదానినన్నది
మహనీయులజాడల్లో
నడిపించేదానినన్నది

ఆలోచననడిగా
నువ్వెవరివని?
శిరసునినిమిరి
సెలవిచ్చింది
కర్తవ్యాలను
భోధించేదానినన్నది
జీవనమార్గాన్ని
సూచించేదానినన్నది

మనసునడిగా
నువ్వెవరివని?
నవ్విమోమును
వెలిగించింది
దేహానికి
దశాదిశానిర్దేశించేదానినన్నది
ఙ్ఞాపకాలను
పుర్రెలోభద్రపరిచేదానినన్నది

ప్రాణాన్నడిగా
నువెవవిరివని?
సూటిగా
సమాధానమిచ్చింది
మనిషిలోని
చైతన్యాన్నన్నది
జీవనానికి
సజీవసాక్షిభూతాన్నన్నది

దేహాన్నడిగా
నువ్వెవరివని?
మనిషికి
ప్రతిరూపాన్నన్నది
మంచిగామసలితే
మానవత్వాన్నన్నది
చెడుగప్రవర్తిస్తే
రాక్షతత్వాన్నన్నది

నరుడా
ఆలోచించు
ప్రేమను
పంచుతావో
ద్వేషాన్ని
రగిలిస్తావో
మానవత్వాన్ని
ఆచరిస్తావో
రాక్షతత్వాన్ని
అనుసరిస్తావో

కామెంట్‌లు