శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది -ఎం. వి. ఉమాదేవి
421)ఉగ్రః -

ఉగ్రరూపంలో కనిపించువాడు
భయంకరమైన ఆకారపు వాడు
నారసింహ అవతారమైనవాడు
భీతిని గలిగించగల వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
422)సంవత్సరః -

సర్వజీవుల ఆశ్రయమైనవాడు
నివాసముగా నున్నట్టివాడు
కాలము తనయందున్నవాడు 
అరువది వత్సరములైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
423)దక్షః -

సమస్త కర్మలనాచరించువాడు
దక్షతతో చేయుచున్న వాడు
సామర్ధ్యం గలిగియున్నవాడు
పనితనము తానైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
424)విశ్రామః -

జీవులకు విశ్రాంతి నిచ్చువాడు
ఊరడిల్లజేయునట్టి వాడు
విరామం ప్రకటించుచున్న వాడు
నిమ్మళంగా నున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
425)విశ్వదక్షిణః -

అశ్వమేథయాగమునున్నవాడు
విశ్వమునే దక్షిణనిచ్చిన వాడు
శ్రేయోభిలాషియైనట్టి వాడు
చరాచరముల నడుపువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు