వర్కింగ్ ఉమన్.. అచ్యుతుని రాజ్యశ్రీ
 వింగ్స్ లేని వర్కింగ్ ఉమన్
ఇంటాబయటా పరుగుల రాణి 
హరిణి నేటి గృహిణి
కోడి కన్నా ముందే లేచి కాఫీచుక్క చాయ్ సేవించి
కుక్కర్ ఎక్కించి రాత్రి టి.వి.సీరియల్ తో పడకపై చేరు
నడ్డివంచి ముగ్గులేసి
పిల్లలు బడి కెళ్ళేదాక కధాకళీ
అన్నీ టైం కి సజావుగా సాగితే భళాభళీ
సహకరించే భర్త ఐతే ఓ.కే.
లేకుంటే సర్కస్ ఫీట్లే
ప్రైవేట్ ఉద్యోగిని పని మరీ ఘోరం
టీచర్ గా ఇన్విజిలేటర్ గా కాళ్ళు పీకుడు
ఆపై క్లాస్ లో సిలబస్ రివిజన్
సఫాయి వనిత బస్సు లేడీ కండక్టర్ పని మహాఘోరం
అసలుసిసలు వర్కింగ్ ఉమన్ అమ్మ కదిలే రోబో
సెలవు రోజుల్లో బంధుమిత్రులు
పనామె గైర్ హాజర్
ఇల్లు క్లీనింగ్
ఇస్త్రీ పెట్టెతో స్త్రీ
అస్తవ్యస్తం ఆరోజు
రిటైరైనా బేబీ సిట్టింగ్
ఆలస్యంగా లేచే కోడలు
డబుల్ వర్క్
నట్టు ఊడిన యంత్రం లా వృద్ధాప్యం లో నెట్టుకుంటూ
విదేశాల్లో కూతురు కోడలి పురుళ్ళకు‌ విమాన యానం
సెలవు రోజు వద్దని ఆక్రోశం
డబుల్ పనితో నీరసం
ఆఫీస్ లో దొరుకు విశ్రాంతి
ఇంటి బాధలు మర్చిపోయి
కబుర్లు కాకరకాయలతో ఆనందించు సుదతి 🌷
కామెంట్‌లు