సుప్రభాత కవిత ; - బృంద
రాలిన ఆకుల మీద
రాబోయే వసంతపు 
అడుగుల చప్పుడు
విని చివురించిన మోడు

నిన్నలేని కొత్త చివురుల
లేత ఎరుపులు చూచి
ముచ్చటగా మురిసి
పచ్చగ మారిన ప్రకృతికి

చురుకుగ నాటిన కిరణం
పంచే వేడికి బిత్తరపోయి
వసంతం రాకను గ్రీష్మం
 ఆహ్వానిస్తున్న తరుణం

విలవిల లాడే జీవులు
వెల వెలపోతున్న దారులు
దాహంతో తపించే ఊళ్ళూ
నీటి కోసం వేచిన బీళ్ళూ

మారిన ఋతువుల తీరుకు
చేసిన తప్పులు  భరించి
కరుణించమని  కోరుతూ
మార్తాండుని వేడుకుంటూ

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు