అమ్మ ప్రేమ;- ఎడ్ల లక్ష్మి
అమ్మా అమ్మా రావమ్మా
చిన్నారి పాప పిలుస్తుంది
చిన్నగా మెల్లగా చూడమ్మా
వెన్న ముద్దలు పెట్టమ్మా !!

నల్లనయ్య వచ్చాడు
పాప చెంతకు చేరాడు
వెన్న ముద్దను చూశాడు
గుటుక్కుమని మింగాడు !!

చిన్నారి పాప ఏడుస్తుంది
పాపా ఏడుపు వినవమ్మా
అరటి పండు తేవమ్మా
పాపకు పండు ఇవ్వమ్మ !!

పక్కకు పొట్టోడున్నాడు
చక్కగా అటు వస్తున్నాడు
చిక్కటి పాలు పోయమ్మ
చంటోని బొజ్జనింపమ్మా !!

కామెంట్‌లు