జీవితానికి సార్ధకత;-సి.హెచ్.ప్రతాప్
 ధనార్జనే పరమావధిగా
అనుక్షణం బ్రతుకుతున్న మానవుడు
మానవతా విలువలు,ప్రేమానురాగాలు,
ఆప్యాయతానుభవాలు,పరుల శ్రేయస్సులను
తుంగలోనికి తొక్కి డబ్బు చుట్టునే
తనను పరిభ్రమింపజేసుకుంటూ,
కృతిమ ముసుగులు తొడుగుకొని
అహర్నిశలూ ధనార్జన కోసమే
తన సర్వ శక్తి యుక్తులను ఒడ్డి
పశువు కంటే హీనమైన జీవితాన్ని జీవిస్తున్న
ఓ నవ యుగపు మానవుడా
ధనం కంటే ప్రేమ, అనురాగం,అప్యాయత, సేవ
భక్తి,మంచితనం, మానవత్వం ఎంతో గొప్పవని
తెలుసుకునే నాటికి నీ జీవితం అంతమైపోతుంది
నిన్ను నీడ వలే వెంటాడి వచ్చేవి నీ మంచి పనులే
మంచితనంతో మంచి కోసమే జీవించి
మంచిని అందరికీ పంచి
అమూల్యమైన ఈ జీవితానికి సార్ధకతను సాధించుకో

కామెంట్‌లు