జ్ఞాన సంబంధ నాయనార్!- అచ్యుతుని రాజ్యశ్రీ
 తంజావూరు లోని శీర్కాలి అనే గ్రామంలో పుట్టాడు ఈశివభక్తుడు.అమ్మనాన్నలు  భగవతి శివపాదహృదయన్ అనే బ్రాహ్మణ దంపతులు.మూడేళ్ల సంబంధతో తండ్రి శివాలయం కి వెళ్లి చెరువు లో స్నానం చేస్తూ కొడుకుని గట్టుపై కూర్చోపెట్టాడు.ఆకలికి చిన్నారి ఏడుస్తూ ఉంటే పార్వతీ దేవి బంగారు పాత్రలో పాలు పిల్లాడికి తాగిస్తుంది. తండ్రి స్నానం చేసి వచ్చి మూతికి పాలు అంటుకోడం చూసి " నీకు ఎవరు పాలు ఇచ్చారని?" అడుగుతాడు.గుడిగాలిగోపురంపై ఉన్న శివపార్వతులని చూపాడు.ద్రవిడభాషలో ఆశువుగా కవిత శివుని పై చెప్పిన కొడుకుని ఎత్తుకుని గుడిలోకి వెల్తాడు తండ్రి.ఆ చిన్నారి పదివృత్తాల. పత్తిగమ్  ను అల్లి గానం చేస్తాడు.అలాతిరు జ్ఞానసంబంధులు అనేపేరు తో ఆపిల్లాడు మూడేళ్ల చిన్నారి ఖ్యాతి గడించాడు.తండ్రి భుజాల పై ఆపిల్లాడిని మోస్తూ పుణ్యక్షేత్రాలు దర్శించాడు.8వ ఏట తండ్రి ఉపనయనం చేశారు.వేదారణ్యపురంలో గర్భాలయం ద్వారం మూతబడి ఉంటే సంబంధుని స్తుతితో అది తెరుచుకుంది. కొల్లిమాలవన్ అనే రాజు కూతురికి అనారోగ్యం.ఆమెకి దేహమంతా మంటలు .ఆ సంగతి తెలిసిన సంబంధులు శివస్తుతి చేయగానే ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది.కొణ్ గు. అనే ప్రాంతంలో విషజ్వరాలు ఈయన చేసిన శివస్తుతి తో మాయమైనాయి.పాండ్యరాజు కూన్ పాండ్య జైనమతం వ్యాప్తికి అనుమతించాడు.రాణి ప్రధాని శివభక్తులు.మధురని సంబంధులవారు దర్శించినప్పుడు ఆయన విడిది చేసిన అతిథిగృహంకి నిప్పంటించారు మతఛాందసులు.అంతేమధురరాజు ఒళ్ళంతా నిప్పులకొలిమిలా మారి మంటలు పెడ్తుంది.సంబంధులవారి శివస్తుతి తో రాజు బాధ తొలగిపోతుంది.అలారాజు జైనమతం వదిలి శైవాన్ని స్వీకరించాడు.కాళహస్తి మొదలైన శివక్షేత్రాలు దర్శించాడు.ఇలా ఆఖరున శీర్కాలి చేరిన ఆయన కు అమ్మానాన్నలు బలవంతంగా పెళ్లి చేశారు.నూతన వధువుతో శివాలయం దర్శించి భక్తి ఆవేశాలతో శివగీతాలు పాడుతూ ఉండగా ఆవధూవరులు మాయమై రెండు జ్యోతులు గా మారి ఒక్కటిగా శివలింగం లో ఐక్యమైన ఘట్టం ని చూసి అక్కడ ఉన్న వారంతా జైజై శంకరా అంటూ నాదాలు నినాదాలతో అంజలి ఘటించారు 🌷
కామెంట్‌లు