మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
మొల్ల విరులు వికసించి 
పరిమళాన్ని వెదజల్లుతున్నాయి
ఆ సుగందాన్ని మనమందరం
ఆస్వాదించాలి.
  
*ఆ సిరా చుక్కలు
నిర్దేశిస్తున్నాయి ఒక నూతన
మార్గం ఆ దారిలో మనమందరం నడవాలి.

*అక్షర జ్యోతి కాంతురేఖలను
సాహిత్య వనములో ప్రసరింపజేసిన ఆమెను మనం అనుసరించాలి.

*కుమ్మరి కులమున పుట్టి
మట్టిలో మాణిక్యంలా జ్ఞాన సంపదను రమణీయ పదాల  దండలో కూర్చుంది.

*కంద పద్యాల కాటిన్యాన్ని
సరళ భావంతో వర్ణించిన ఆమె శైలిని మనం ఆకలింపు చేసుకోవాలి.

*రామాయణ పాత్రలు
హృదయాంతరంలో అదృశ్యంగా దర్శనమిస్తాయి
నిర్మలమైన ఆమె ముఖారవిందం రచన శైలిలో కనిపిస్తుంది.

*తొలి తెలుగు కవయిత్రి
విదుషిమణి.భావి భారత కవయిత్రులకు ప్రేరణ ఆమె.
  
.
కామెంట్‌లు