సుప్రభాత కవిత ; - బృంద
నిరంతర పయనం
కనరాని గమ్యం
విరామమే లేని గమనం

విధికి ఎదురే జీవితం
గతి మారినా ప్రగతి కోసం
ప్రఛ్ఛన్న యుధ్ధం

ఆడుగుల కింద జారే క్షణాలు
అహరహమూ  అస్తిత్వం కోసం
అలుపెరుగని రణాలు

ఉదయపు వెలుగులో
పుత్తడి రజనుకి  మల్లే
మెరిసే సైకత రాశులు

ప్రతిక్షణమూ విలువైనదేనని
పట్టి వుంచలేవనీ
నడక సాగే తీరాలని హితవులు

అరణ్యమైనా....అందాలసీమనైనా
ఇసుక మేటలో అయినా
ఇంటి ముంగిలి లోనైనా

ఒకటే వెలుగు ఒకటే కాంతి
ఒకటే ఆశ ఒకటే ధ్యాస
చైతన్య ధారల ప్రసరింపు...

జగతికి మేలుకొలుపు
సుగతికి దారిచూపు
ప్రగతి పథపు కొత్త మలుపునకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు