శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
476)ధర్మకృత్ -

ధర్మమును ఆచరణజేయువాడు 
ధర్మ జ్ఞానమును కలిగియున్నాడు
కృత్యములలో ధర్మమున్నవాడు 
ఉపదేశమును చేయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
477)ధర్మీ -

ధర్మముకు ఆధారమయినవాడు 
కర్మ ద్యుతి తెలిసినట్టివాడు 
ధర్మవిచక్షణ గలిగినవాడు 
సత్యమే ధర్మంగా తెలుపువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
478)సత్-

మూడుకాలాలలో నున్నట్టివాడు 
సృష్టి పర్యంతము నిలుచువాడు 
సత్తు పరిణామం తెల్పువాడు 
పరిధి తెలిపిగమనించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
479)అసత్ -

పరిణామక్రమంలో నున్నవాడు 
జగత్తుకి ఆశ్రయమిచ్చినవాడు 
సద్భావనలను పొందగలవాడు 
ఆశావహమై యుండునట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
480)క్షరః -

వ్యయమగు విశ్వరూపమున్నవాడు 
తెలియబడుచున్నట్టి వాడు 
విష్ణురూపములో నున్నట్టి వాడు 
భక్తి పోగుజేయబడుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు