సుప్రభాత కవిత ; బృంద
సాలెగూటి అల్లికలో
అతిశయమెంతో....
కనిపించని దారాల
వినిపించని రాగాలేమిటో!

ఎవరు నేర్పిన విద్యయో
తనకు మాత్రమే సాధ్యమో!
కొమ్మల నడుమ సయోధ్యగా
ఎంచక్కని వారధియో!

నిశిని కురిసిన నీహారికలను
ఒడిసి పట్టి వుంచి దాచి
మంచుముత్యాలపేట చుట్టి 
మురిపించే ఉషస్సుకి కానుకిచ్చే...

అనురాగమెంత మధురమో!
అభిమానమెంత పదిలమో!
అలవిజాలని అపేక్షకిది
అందమైన చిత్తరువు కాదా!

ఎటనుంచి ఎటకేగి వచ్చెనో
ఇటువచ్చి ఇలనుచేరి
ఇంపైన రాగబంధమునందు
ఇదుగో ఇలా బందీ అయినది

తెలియని స్నేహాలు
మమతల బంధాలై
చిప్పలో  ఆణిముత్యమల్లే
మేలైన మాలిమితో నిలిచిపోవా!

జీవన మకరందమీరీతి
చవిచూపనెంచి కాలము
మనకొసగెే బహుమతి
ఏ బంధమైనా...స్నేహమైనా

అపురూప క్షణాల గుత్తిని
అందింప ఆగమించు
ఆదిత్యునికి అంజలి ఘటిస్తూ

🌸🌸సుప్రభాతం 🌸🌸
కామెంట్‌లు