తప్పనిది.. తప్పించుకోలేనిది;- కోరాడ నరసింహా రావు..!
కర్మ లను బట్టే...జన్మలు ! 
   దీ న్ని  పుట్టించిన ఆ దేవుదు కూడా మార్చలేడు...! 
  అనుభవించి తిరాల్సిందే..!! 

జన్మ ఆనంద మయం కావాలంటే..., 
 అది మన చేతుల్లోనే... 
 మన చేతలలోనే వుంది...! 

"పరోప కారాయ పుణ్యాయ
 పాపాయ పర పీడన0 "
 "పుణ్యం గొడుగు, పాపంపిడుగు "
 ఇవి పెద్దలు చెప్పిన మాటలు
  చద్ది కూడు మూటలే..! 
 సందేహించవలసిన పనిలేదు!!

పరోపకార , దాన ధర్మాలు... 
 పరుల కోసం మనం చేస్తున్నవి కావు....! 
  మన భవిష్యత్తు కోసం... 
 మనం దాచు కుంటున్న .... 
 నిధి, నిక్షేపాలు...!! 

చేతనైతే... ఎవరికైనా మేలు చెయ్ ..., 
  ఏ ఒక్కరికీ కీడు మాత్ర0 చెయ్యకు...! 
  ఆలా చేస్తే..., 
 ఆ పాపమే... శాపమై అంతకు అంత...వివిధ దుఃఖాల రూప0లో. .. తరువాత
  నీవే అనుభవించ వలసి వస్తు0ది... తెలుసుకో...! 
 అది వెంటనే కావచ్చు... 
   మరు జన్మ కైనా కావచ్చు ..!! 
       తప్పదు...!!! 
కామెంట్‌లు