సుప్రభాత కవిత ; - బృంద
దూది పింజల్లా తేలే
పాలమబ్బుల హేల
చేతికందక జారిపోయే
క్షణంలా ఊరించే కల

ఆధారంలేని ఆశలు
అల్లుకున్న అందమైన మాల
అంబరమంతా స్వేఛ్ఛగా
తిరిగే అలుపులేని అల

అందినట్టే అంది దూరమయే
ఊరించే ఊహల గోల
అందరికీ అనుభవమే ఇది
వెంటాడే అందమైన వల

మాయల మబ్బులు కమ్మి
మలినమైన మనసును
వెలుగులతో కడిగేసి
నిర్మలంగా మార్చితే బాగు!

అదుపులేక  ఆవరించిన
అనవసరపు కాంక్షలను
ఆదరంగా  అర్థమయేలా
అణచివేస్తే బాగు!

జీవితపు పరమార్థం
విప్పి చెప్పి విడువక
వెంట ఉండి నడిపించి
తీరం చేరిస్తే బాగు!

మంచితనపు సుగంధం
మనసుకు అంటేలా
మానవత్వపు విలువలు
విప్పి చెబితే బాగు!

జ్యోతికలశం మోసుకొచ్చే
మంచిమార్పుల మూటలకు
స్వాగతమంటూ

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు