రైఫిల్ షూటింగ్ కు ఎంపికైన గుడిబడి విద్యార్థులు
 ఏప్రిల్ 29 నుండి కాకినాడ లో జరిగే ఇంటర్ డైరెక్టరేట్ షూటింగ్ చాంపియన్ కాంపిటేషన్స్ (ఐ.డి.ఎస్.సి.సి) జాతీయ స్థాయి ఎన్.సి.సి. షూటింగ్ శిబిరానికి వరంగల్ గుడిబడి కి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మాస్టర్ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. వరంగల్ జిల్లా పరిధిలోని టెన్ టి బెటాలియన్ సెంటర్ వున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల గుడిబడి నరేంద్రనగర్ లో  ఈ విద్యా సంవత్సరం 9 వ తరగతికి చెందిన డి.శివ, సి.హెచ్. అభినవ్, కె.లిప్సిక లు ఈ షూటింగ్ శిబిరానికి ఎంపిక కావటం పై పాఠశాల ఎన్.సి.సి.అధికారి జోగు ప్రవీణ్ కుమార్ , సీనియర్ టీచర్లు కుమార స్వామి. అజయ్ బాబు , శ్రవణ్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
వరంగల్ లోని నాలుగు ఎన్.సి.సి. బెటాలియన్ ల పరిధిలోని 10 టి బెటాలియన్ కు చెందిన ఆర్మీ వింగ్ కమాండర్ ఎ.ఎన్.ఖండూరీ నేతృత్వంలో 18 సోమవారం వరంగల్ అమ్మవారిపేట ఫైరింగ్ రేంజ్ ఏరియాలో విద్యార్థుల ఎంపిక నిర్వహించారు. ఈ ఎంపికలో గుడిబడి కి చెందిన ముగ్గురు బాలబాలికలు రాష్ట్రస్థాయి ఫైరింగ్ శిక్షణా శిబిరం కాకినాడకు వెళ్ళనున్నారు.
కామెంట్‌లు