శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
441)నక్షత్రీ -

తారల రూపంలో నున్నట్టివాడు
చంద్రగ్రహము తానైనవాడు
నక్షత్రమాల యందున్నవాడు
తారామండలంలో గలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
442)క్షమః -

సహనాన్ని కలిగియున్నవాడు
సర్వుల క్షమించుచున్నట్టి వాడు 
క్షమాగుణ సంపన్నుడైనవాడు
మన్నించుహృదయం గలవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
443)క్షామః -

కరువును సృష్టించగలవాడు 
నశింపజేయునట్టి వాడు
క్షయము నేరుగనీయనివాడు
క్షామములో రక్షణగు వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
444)సమీహనః -

సర్వభూతహితము కోరువాడు
భక్తులను అనుగ్రహించువాడు
సమీపభావన కలిగించువాడు
కారుణ్యభావన కలిగించువాడు 
 శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
445)యజ్ఞః -

యజ్ఞస్వరూపుడయిన వాడు
హవిస్సులు అందుకొనువాడు
యజ్ఞప్రదేశమావరించినవాడు
వేదమంత్రమునున్నట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు