పుత్తడి వెలుగులు
పుణికి పుచ్చుకుని
పచ్చగ మెరిసే ప్రకృతి
వెచ్చగ మారిన జగతి
చిటారు కొమ్మన సంపెంగైనా
కాలువ ఒడ్డున తంగేడైనా
విరిసి మురిసే సమయం
తెలివెలుగుల తొలిసంధ్య
ముద్దబంతికైనా
ముద్దు గులాబీకైనా
ప్రత్యేక పరిమళం
ప్రత్యేక సౌందర్యం
వెలుగుతున్న కిరణాలు
భువి తాకినంతనే
చెదిరిపోతూ కనుమరుగయే
చిక్కటి చీకటి నీడల తెరలు
ఎవరి జీవితం వారికి
దొరికిన గొప్ప అవకాశం
వేడుకైనా వేదనైనా
ఒక్కలాగే నిలవాలి
కలలు నింపి కరుణ చూపి
రేపటిపై ఆశను నింపి
ఆడుగు ముందుకే వేసేలా
చేయిపట్టి నడిపించే కర్మసాక్షికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి