సుప్రభాత కవిత ; - బృంద
చీకటొస్తేనే వెన్నెల విలువ
వెలుగొస్తేనే వన్నెల కొలువు
రంగులన్నీ ఏకమై విరిసే
వెలుతురు పూల జాతర

సిరి మల్లె నవ్వులన్ని
హరివిల్లుగ మురిపింప
మురిపాలు పొంగి పొర్లి
ప్రతి ముంగిలి నిండిపోగా

సరదాల సంతోషాలు
కురిపించు  ఉత్సాహాలు
మై మరచి ఆడిపాడి 
కురిపించు ఆనందాల జడి

తరతమ బేధంలేక
ఒకటిగ  కలిసే వేడుక
నిరతము  నిలిచే భావన
వరమై ఇమ్మని ప్రార్థన

కనక  కాంతులు వెలిగే
సమయము కావాలని
వినతులెన్నో దైవానికి
వినమ్రంగా చేసుకుంటూ

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు