ముగింపు!!!; - డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా
నేను భ్రమిస్తానని
విశ్వకేంద్రమే ఆగిపోయింది.!!

నేను శ్రమిస్తానని
భూదేవి రంధ్రమే మూసుకుపోయింది.!!

బంగారు నదిని భయపెట్టింది
పాదరసం ఒక్కటే!!!

నేను ప్రేమిస్తానని
చండీ శిఖండి గా మారింది!!!

నేను నిన్ను విశ్వసిస్తు శ్వాసిస్తున్నానంటే
గాలి గడ్డ కట్టుకుపోయింది!!!

ఆకాశాన్ని అద్దాన్ని చేసి
పగలగొడతావా!!!?

అందాన్ని శవాన్ని చేసి
ముఖాన్ని సృష్టిస్తావా!!!?

అవకాశాన్ని విషాన్ని చేసి
కంఠాన్ని ఖండిస్తావా!!!?

ఎగిరిపోయేది గాలి కాదు
గ్రహం!!

విరిగిపోయేది పాలు కాదు
నిగ్రహం!!!

కరిగిపోయేది నీరు కాదు
వెలుగు!!

కల్పవృక్షం కన్న కల
పారిజాతం పంచిన పరిమళం
ఐరావతం ఊరేగిన వీధి కాల్పనికం కాదు 
అది కాలం చేసినా కాలం!!!

కోతి చేసిన కాపురం
చింపాంజీ చేసిన రూపాంతరం
రక్త మాంసాల రంగస్థలంపై
కర్రె చీమ ఎర్ర చీమ 
నాటకీయతకు ముగింపు.!!!?

అత్తమ్మ ను స్మరించుకుంటూ

డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏
కామెంట్‌లు