భారతాంబ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 గగనమంత నిండుతోంది భారతీప్రభ
గతమెంతో ఘనకీర్తి కలిగినట్టిది
గలగలమని ప్రవహించే అమృతధారలు
గమ్మత్తైన విన్యాసాల జీవజాలము
గణేశుడు దీవించే దివ్యభూములు
గంతులేసి ఆడేటి ఆబాలగోపాలము
గరికపాటి చేయని శత్రుజాలము
గతితప్పని భారతీయ స్నేహధారలు
గజ్జకట్టి ఆడేటి నాట్యకారులు
గమకములు పాడేటి గానమూర్తులు
గంగమ్మకు మొక్కేటి జానపదులు
గజాలకొద్దీ చీరలిచ్చే నేతన్నలు
గతిమారిన భవ్యమైన వృత్తికారులు
గరిమతోడ వీరులైన భరతపుత్రులు
గమ్యమెంతొ సుందరం భావికాలము
గంధఫలిని నిశ్వసించు భారతాంబ!!
***********************************
కామెంట్‌లు