శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
436)స్థవిష్ఠః -

విరాట్ రూపంలోనున్నవాడు
దిగంతములు నిండినవాడు
విష్ణుమూర్తి తానైనవాడు
మిక్కిలి స్థూలమైయున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
437)అభూః -

పుట్టుక లేకుండినవాడు
పూర్వము లేనట్టివాడు
స్వతంత్రత గలిగినవాడు
విష్ణు అంశమునున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
438)ధర్మయూపః -

ధర్మముకు కట్టుబడినవాడు
ధర్మంతో కలిసినవాడు
యజ్ఞమున నివసించువాడు
ధర్మయూప నామమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
439)మహామఖః -

ధర్మస్వరూపుడై యున్నవాడు
యజ్ఞము తానైనట్టి వాడు
వేదసహితుడై యున్నవాడు
మహామఖ నామధేయుడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
440)నక్షత్ర నేమిః -

జ్యోతిష్యమును చెప్పువాడు
చక్రవర్తితనము చేయువాడు
నక్షత్రనేమిగా నుండువాడు
గ్రహగతులను తెలుపువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు