శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ; - కొప్పరపు తాయారు
 🍀 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀

3) పౌఢోహం యవనస్థో  విషయ విషదరైః
      పంచభిర్మర్మసంధౌ
       దష్టో నష్టో వివేకః సుతధన
       యువతి స్వాద  సాభ్యే నిషషణ్ణః !
       శైవే చిన్తా విహీనం మమ హృదయ
        మ హో మాన గర్వాధిరూఢం
         క్షన్తవ్యో మేపరాధః
         శివ శివ శివ భోః 
          శ్రీ మహాదేవ శంభో!

3) నేను యువకుడ నయినంతనే సుఖముల నాసించు పంచేంద్రియములనే సర్పములచే మర్మస్థానము నందు కరువబడితిని , మంచి చెడులను తెలుసుకొను విక్షణజ్ఞానము నశించినది. పుత్ర , ధన, యువతి, సుఖముల అనుభవించుటలో మునిగితిని. అభిమానము నిండి గర్వించిన నా హృదయం శివ ధ్యానమును విడిచినది ఓ మహాదేవా! శంభో! నా అపరాధమును క్షమింపుము.
      ****🪷***
🪷 తాయారు 🪷
కామెంట్‌లు