శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
471)వత్సలః -

అమితమైన వాత్సల్యమున్నవాడు 
ప్రేమతో చేరదీయుచున్నవాడు 
భక్తుల యోగక్షేమకారకుడు 
సమాదరణమున్నట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
472)వత్సీః -

తండ్రివంటి ఆప్యాయతవున్నవాడు 
బాలురవలే ఆదరించువాడు 
భక్తజనులను గాచుచున్నవాడు 
రక్షణభావన గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
473)రత్నగర్భః -

సాగరమువలే నున్నట్టివాడు 
రత్నరాసులు గలిగినవాడు 
గర్భమున ముత్యాలున్నవాడు 
మణిమాణిక్యసహితుడైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
474)ధనేశ్వరః -

సంపదలకు ప్రభువైనవాడు 
ధనముకు ఈశ్వరుడైనవాడు 
లక్ష్మి తనయందేయున్నట్టివాడు 
సంపదకు మూలమైయున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
475)ధర్మగుప్ -

ధర్మాన్ని రక్షించుచున్నట్టివాడు 
ధర్మ ప్రయోగము చేయుచున్నవాడు 
న్యాయమును కాపాడగలవాడు 
సత్యధర్మములను గుప్పెడువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు