ఓ కవీ!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కలములో ఏముంది
గళములో ఏముంది
నీ కలములో ఏముంది
నీ గళములో ఏముంది

కలములో తీపితలపులు
గళములో తేనెచుక్కలు
నా కలములో కమ్మదనాలు
నా గళములో తేనెచుక్కలు

పుటలలో ఏముంది
పుస్తకములో ఏముంది
నీ పుటలలో ఏముంది
నీ పుస్తకములో ఏముంది

పుటలలో భావనలు
పుస్తకములో పలుప్రక్రియలు
నా పుటలలో భావనలు
నా పుస్తకములో పలుప్రక్రియలు

అక్షరాలలో ఏముంది
పదాలలో ఏముంది
నీ అక్షరాలలో ఏముంది
నీ పదాలలో ఎముంది

అక్షరాలలో అర్ధాలు
పదాలలో ప్రాసలు
నా అక్షరాలలో అర్ధాలు
నా పదాలలో ప్రాసలు

వ్రాతలలో ఏముంది
చేతలలో ఏముంది
నీ వ్రాతలలో ఏముంది
నీ చేతలలో ఏముంది

వ్రాతలలో విషయాలు
చేతలలో వివరాలు
నా వ్రాతలలో విషయాలు
నా చేతలలో వివరాలు

పలుకులలో ఏముంది
కులుకులలో ఏముంది
పలుకులలో ఏముంది
నీ కులుకులలో ఏముంది

పలుకులలో తేనియలు
కులుకులలో కుతూహలాలు
నా పలుకులలో తేనియలు
నా కులుకులలో కుతూహలాలు

మోములో ఏముంది
మనసులో ఏముంది
నీ మోములో ఏముంది
నీ మనసులో ఏముంది

మోములో అందాలు
మనసులో అనందాలు
నా మోములో అందాలు
నా మనసులో ఆనందాలు

మాటల్లో ఏముంది
పాటల్లో ఏముంది
నీ మాటల్లో ఏముంది
నీ పాటల్లో ఏముంది

మాటల్లో మధురిమలు
పాటల్లో పదనిసలు
నా మాటల్లో మధురిమలు
నా పాటల్లో పదనిసలు

పంక్తుల్లో ఏముంది
పొందికల్లో ఏముంది
నీపంక్తులలో ఏముంది
నీ పొందికల్లో ఏముంది

పంక్తులలో పరుగులు
పొందికల్లో పసందులు
నా పంక్తులలో పరుగులు
నా పొందికల్లో పసందులు

కవిత్వములో ఏముంది
సాహిత్యములో ఏముంది
నీ కవిత్వములో ఏముంది
నీ సాహిత్యములో ఏముంది

కవిత్వములో కమ్మదనాలు
సాహిత్యములో సమ్మోహనాలు
నా కవిత్వములో కమ్మదనాలు
నా సాహిత్యములో సమ్మోహనాలు

ఏమేమి కావాలి
ఇంకేమి కావాలి
నీకు ఏమేమీ కావాలి
నీకు ఇంకేమి కావాలి

కావాలి స్పందనలు 
కావాలి సన్మానాలు
నాకు కావాలి స్పందనలు
నాకు కావాలి సన్మానాలు

కామెంట్‌లు