మనిషి ఒకప్పుడు ఒంటరి జీవి.!
ఆ తర్వాత కుటుంబజీవి!!
ఆ తరువాత సంఘజీవి!!!
ఇప్పుడు
కేవలం కుటుంబ జీవి మాత్రమే!!!?
కానీ
కోతి సంఘజీవి
చీమ సంఘజీవి
కాకి సంఘజీవి
వీటికి కుటుంబం లేదు!
అందుకే స్వార్థం లేదు!!
మనిషికి కుటుంబం ఉంది
అందుకే స్వార్థం పెరిగింది!!?
చెట్టు నది మేఘం
వీటికి జీవితం లేదు
కానీ ఒక అర్థం ఉంది
వీటికి స్వార్థం లేదు
కానీ ఒక పరోపకారం ఉంది!!?
హృదయము మెదడు ఆడ మగ
ఒకరంటే ఒకరికి పడదు
కానీ ఇద్దరూ ఒకటే!!?
మనిషిలో స్వార్థం నిస్వార్ధము కూడా ఒకటే!
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి