ప్రార్థిస్తున్నా!;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 లౌకికము తెలియని బాలను
కౌగిలిలో నలిపివేసి
లేచిన మృగాడవు కదా
గిజిగాడి గూడువలె అల్లిన
మేటి  కుటుంబపు గౌరవమును
పిడికిలితో నలిపివేయ నిప్పు
కణిక వంటి తప్పుచేయ
కతిపయ దినములలోనే నిన్ను
కదిలించును ఆ దేవుడు మూర్ఖ!
కనికరములేని దయాహీనుడా
విపినమార్గమున పడి నడుచు 
శిబివీవు నిజముగ నీకు
క్రిమి భోజనము సరియైన శిక్షేగా
కాయికముగ మరింత కఠినముగా శిక్షించి
మరిచిపోనట్టి శాస్తి నీకు
కలిగించుమని ఆ దేవుని నే ప్రార్థిస్తున్నా!!

{శిబి=హింసించే పశువు}
*************************************
:.
కామెంట్‌లు