భూదేవి ఒడిలో తరువు;- ఎడ్ల లక్ష్మి- సిద్దిపేట
భూదేవి ఒడిలో తరువు
పచ్చపచ్చగ ఎదుగుతూ
ముద్దు ముద్దుగా వొదుగి
పచ్చని పందిరి వేసింది

ఊడల ఊయల కట్టింది
నీడను పరిచి చూపింది
పక్షులకు రక్షణ ఇచ్చింది
పర్వసించదిమురిసింది

సూర్య తాపమాపుతూ
చల్లని గాలిని వీచింది
అందరిని మురిపిస్తూ
ఆదర్శంగా నిలిచింది

వసుధ మీది ప్రాణులకు
ప్రాణవాయువు నిచ్చింది
కన్నతల్లి లాంటావృక్షము 
ప్రకృతి అందం పెంచింది

కామెంట్‌లు