సౌందర్య లహరి;- కొప్పరపు తాయారు
🌟శ్రీశంకరాచార్య విరచిత🌟

సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా ।
చిరం జీవన్నేవ క్షపితపశుపాశవ్యతికరః
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ ॥ 99 ॥

ప్రదీపజ్వాలాభిర్దివసకరనీరాజనవిధిః
సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా ।
స్వకీయైరంభోభిః సలిలనిధిసౌహిత్యకరణం
త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్ ॥ 100 ॥
99) అమ్మా ! పార్వతీ !నిన్ను సేవించే వాళ్ళు సరస్వతి లక్ష్మి  సమేతులకు, బ్రహ్మ విష్ణువులకు,
శత్రువు లగుచున్నారు. సుందరాంగియైనా రతీ 
 ప్రాతివత్యాన్ని సహితం భంగపరిచే వాడు అవుతున్నాడు. చిరకాలం జీవించి  అవిద్యను సహితం భంగపరిచేవాడు అవుతున్నాడు. చిరకాలం జీవించి కూడా ఆవిద్య అంతం కాగా జీవంతో ప్రబ్రహ్మానందాన్ని పానం చేస్తున్నాడు కదా! తల్లీ!ఁ
100) జననీ!  భవదీయ ప్రసాద లబ్ధమై వాఘ్రూపమై ఈ నీ స్తుతి సూర్యనారాయణునికి సమర్పించ వెలుగుతున్న హారతి లాంటిది. చంద్రుడికి చంద్రకాంత మణుల సలిలాలతో సమర్పించే జలర్థం వంటిది.
సముద్రానికి సాగర సలిలాలతో సౌఖ్యాన్ని చేకూర్చడంలా అవుతుంది కదా! తల్లీ!
                 ****🪷****
🪷 తాయారు 🪷
కామెంట్‌లు