నూతన తిరుపతి జిల్లా ప్రధానకార్యదర్శిగా ధనాశి ఉషారాణిని
 శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడిన జానపద స్వరగానo కార్యక్రమంలో చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణిని నూతన తిరుపతి జిల్లా ప్రధానకార్యదర్శిగా నియమిoచినట్టుగా జాతీయ ఛైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు మరియు రాష్ట కార్యదర్శి అరవ జయపాల్ గారు ప్రకటించడం జరిగింది.మరియు ధనాశి ఉషారాణి రచించిన నూతన పద్య ప్రక్రియ పంచరవళి శతకoను ఆచార్యులు శ్రీమతి కుసుమకుమారీ మేడమ్ మరియు  విశ్రాంతి ఆచార్యులు మాలకొండయ్య గారి చేతులు మీదుగా ఆవిష్కరించడము జరిగింది.ప్రముఖులు చేతులు మీదుగా శ్రీ శ్రీ కళా వేదిక జానపద స్వరగానo  జ్ఞాపికను అందుకోవడo జరిగింది.ప్రముఖులు శ్రీ సా కo నాగరాజు గారు ఆకుల మలేశ్వరరావు గారు రాసాని వెంకట్రామయ్య గారు హేమమాలిని గారు కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు.
కామెంట్‌లు