సిరా కలం" (INK PEN);- -గద్వాల సోమన్న,9966414580
ఒక వ్రాత పరికరము
గొప్పదోయ్!  పనితనము
దాని పేరు "సిరా కలం" 
వాడే వారు పూర్వము

సిరాతో పని చేసేది
దాని సాయం కోరేది
అదే అదే సిరా కలము
కవీంద్రుల మహా బలము

తెల్ల కాగితంపై
ముద్దుగా మెరిసేది
కుదురుగా జేబులో 
కూర్చోని ఉండేది

అందమైన సిరా కలము
అక్షరాలతో స్నేహము
గతమంతా దానిదే!
దాని సేవ గొప్పదే!

కామెంట్‌లు